25 రోజులు వెయిట్ చేయించి.. చివరికి ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు!: సందీప్ కిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

25 రోజులు వెయిట్ చేయించి.. చివరికి ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు!: సందీప్ కిషన్

  • ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నా వెళ్లేవాడిని 
  • 'అష్టాచమ్మా'లో ఛాన్స్ రాలేదు 
  • 'హ్యాపీడేస్'లో ఛాన్స్ చివరి నిమిషంలో చేజారిపోయింది
తన తోటి కథానాయకులతో పోటీపడుతూ .. కొత్త కథలకు ప్రాధాన్యతనిస్తూ సందీప్ కిషన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. " నటుడిగా తెరపై కనిపించడానికి నేను చాలా కష్టాలే పడ్డాను. ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నా వెంటనే అక్కడికి వెళ్లిపోయేవాడిని. అలా 'అష్టాచమ్మా' సినిమా ఆడిషన్స్ కి కూడా వెళ్లాను"

"అప్పటికే నానిని ఖరారు చేశారు .. శ్రీనివాస్ అవసరాలకి ఆడిషన్ జరుగుతోంది. 'హ్యాపీడేస్' సినిమా ఆడిషన్స్ జరుగుతూ వుంటే వెళ్లి కలిశాను. నిఖిల్ చేసిన పాత్ర కోసం నన్ను ఫైనలైజ్ చేశారు .. చివరి నిమిషంలో మారిపోయింది. ఆ తరువాత ఒక దర్శకుడు తన సినిమాలో నన్ను హీరోను చేస్తానని చెప్పి హైదరాబాద్ రమ్మంటే వెళ్లాను. సినిమా ఆఫీస్ లో ఒక రూమ్ లో ఉంటూ .. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. అలా 25 రోజులు వెయిట్ చేయించి ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు" అని చెప్పుకొచ్చాడు.    
sundeep kishan

More Telugu News