ఒకేరోజు విడుద‌ల కాబోతున్న‌ ప్యాడ్ మ్యాన్, ప‌ద్మావ‌త్... స్పందించిన అక్ష‌య్ కుమార్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకేరోజు విడుద‌ల కాబోతున్న‌ ప్యాడ్ మ్యాన్, ప‌ద్మావ‌త్... స్పందించిన అక్ష‌య్ కుమార్‌

  • సానుకూలత వ్య‌క్తం చేసిన అక్ష‌య్ కుమార్‌
  • ఏ సినిమా ప్ర‌త్యేక‌త దానికి ఉంటుంద‌ని వ్యాఖ్య‌
  • ఎప్పుడైనా విడుద‌ల చేసుకునే హ‌క్కు నిర్మాత‌ల‌కు ఉంద‌న్న న‌టుడు
వివాదాల ఊబిలో నుంచి బ‌య‌టిప‌డి, పేరులో స్వ‌ల్ప మార్పుతో ఎట్ట‌కేల‌కు సంజ‌య్ లీలా భ‌న్సాలీ 'ప‌ద్మావ‌త్‌' చిత్రం విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అదే జ‌న‌వ‌రి 25న అక్ష‌య్ కుమార్ 'ప్యాడ్ మ్యాన్‌' చిత్రం కూడా విడుద‌లకాబోతోంది. దీంతో ప‌ద్మావ‌త్ సినిమా వ‌ల్ల ప్యాడ్ మ్యాన్ సినిమాకి కొంత న‌ష్టం ఉంద‌నే వార్త‌లు బాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. రెండూ ప్ర‌త్యేక కథాంశంతో తీసిన‌వి కావ‌డం, ట్రైల‌ర్లు, టీజ‌ర్లు అంచ‌నాల‌ను పెంచ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాల విడుద‌ల కోసం అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ విష‌యంపై అక్ష‌య్ కుమార్ త‌న అభిప్రాయాన్ని మీడియాకు వెల్ల‌డించారు. ప‌ద్మావ‌త్ విడుద‌ల అవ‌బోతుండ‌టం త‌న‌కు ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని సానుకూలంగా స్పందించారు. ఏ సినిమా ప్ర‌త్యేక‌త దానికి ఉంటుంద‌ని, సినీ నిర్మాత‌ల‌కు త‌మ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుద‌ల చేసుకునే హ‌క్కు ఉంటుంద‌ని అక్ష‌య్ అన్నారు. సినిమాల మ‌ధ్య పోటీ అనే స‌మ‌స్య ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా విడుద‌ల తేదీ గురించి 'ప‌ద్మావ‌త్' చిత్ర బృందం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.
akshay kumar
sanjay leela
deepika
pad man
padmavath

More Telugu News