మరో సెల్ఫీ పోస్ట్ చేసిన విరాట్... అభిమానుల ఫిదా!
- కేప్‌టౌన్‌లో రెండో హనీమూన్
- ఇప్పటికి రెండు సెల్ఫీలు పోస్ట్ చేసిన విరుష్క
- అనుష్క ఉండటం వల్ల కేప్‌టౌన్ మరింత అందంగా మారిందన్న విరాట్
`కేప్‌టౌన్ చాలా అందమైన ప్రదేశం. నా 'ప్రేమ' కూడా ఇక్కడ ఉండటంతో కేప్‌టౌన్ ఇంకా అందంగా కనిపిస్తోంది` అని విరాట్ ట్వీట్ చేశారు. విరాట్ షేర్ చేసిన ఫొటోకే కాదు.. విరాట్ రాసిన పోస్ట్‌కి కూడా విరుష్క అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారు కేప్‌టౌన్‌కి వెళ్లిన నాటి నుంచి విరాట్ పోస్ట్ చేసిన రెండో సెల్ఫీ ఇది. వారి మొదటి హనీమూన్ ఫిన్లాండ్‌లో మంచు కొండల అందాల నడుమ జరిగిన సంగతి తెలిసిందే.