ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోతే ద్రోహం చేసినవాడిని అవుతా: రజనీ కాంత్
- తమిళ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి
- మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి
- డబ్బు, పరపతి కోసం రావడం లేదు
తమిళనాట రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని చెప్పారు. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు తమిళనాడును చూసి నవ్వుకుంటున్నాయని అన్నారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాడిగా మిగిలిపోతానని చెప్పారు. తనకు తమిళ ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తెలిపారు.