శర్వానంద్ తో సెట్స్ పైకి వెళుతోన్న సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ తో సెట్స్ పైకి వెళుతోన్న సాయిపల్లవి

  • హను రాఘవపూడితో శర్వానంద్ 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • వచ్చేనెల 3వ వారంలో సెట్స్ పైకి  
'ఫిదా' సినిమాతో యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను సాయిపల్లవి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత వచ్చిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాతో ఆమె తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తాజాగా ఆమె శర్వానంద్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రసాద్ - సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు.

వచ్చేనెల 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. 'లై' సినిమాతో నితిన్ కి హను రాఘవపూడి ప్లాప్ ఇచ్చాడు. ఒక వైపున 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' తో హిట్ అందుకున్న సాయిపల్లవి .. మరో వైపున 'మహానుభావుడు' తో సక్సెస్ ను సాధించిన శర్వానంద్ .. హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఆయన రెడీ చేసుకున్న కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నందువల్లనే వాళ్లు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది.      
sharwanand
sai pallavi

More Telugu News