ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం.. బీజేపీ నేత రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు!
Add ap7am to your home Screen

ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం.. బీజేపీ నేత రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • ద్రౌపది ప్రపంచంలోనే తొలి ఫెమినిస్ట్
  • భర్తల మాటలు ఆమె ఎప్పుడూ వినలేదు
  • ఆమె కారణంగా జరిగిన యుద్ధంలో 18 లక్షల మంది మృతి  
పాండవుల సతీమణి ద్రౌపదిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రపంచంలోనే తొలి స్త్రీవాది అని కొనియాడుతూనే, ఆమె మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ వారి మాట వినలేదని రామ్ మాధవ్ అన్నారు. శ్రీకృష్ణుడి మాటలనే ఆమె వేదవాక్కుగా పరిగణించేదని తెలిపారు. మహాభారత యుద్ధానికి ఆమె మొండి పట్టుదలే ఏకైక కారణమన్న రామ్ మాధవ్ ఆ యుద్ధంలో ఏకంగా 18 లక్షల మంది అసువులు బాసారన్నారు.
Ram Madhav
BJP
Draupadi
feminist

More Telugu News