రెండు చోట్లా బీజేపీయే... గుజరాత్, హిమాచల్ తొలి ఫలితాల సరళి!
Add ap7am to your home Screen

రెండు చోట్లా బీజేపీయే... గుజరాత్, హిమాచల్ తొలి ఫలితాల సరళి!

  • ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే తొలి ఫలితాల సరళి
  • గుజరాత్ లో 19 చోట్ల బీజేపీ ఆధిక్యం
  • 10 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
  • హిమాచల్ లో బీజేపీ 8, కాంగ్రెస్ 2 చోట్ల ఆధిక్యం
గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల తొలి సరళి వెలువడుతోంది. గుజరాత్ లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ పూర్తి కాగా, బీజేపీ 19, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక హిమాచల్ విషయానికి వస్తే 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొలి రౌండ్ పూర్తి కాగా, 8 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తొలి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపించాయి. ఓట్ల లెక్కింపునకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా, హిమాచల్ లో కాంగ్రెస్ కు, గుజరాత్ లో బీజేపీకి ఆధిక్యం కనిపించింది. ఓట్ల లెక్కింపు చేస్తున్న కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
Gujarath
Congress
Assembly Elections
Counting

More Telugu News