త్వరలో జల్లికట్టు ప్రీమియర్ లీగ్... జనవరి 7 నుంచి ప్రారంభం
- ఐపీఎల్ తరహాలో జల్లికట్టు పోటీలు
- నిర్వహిస్తున్న తమిళనాడు జల్లికట్టు పెరవై
- ఇంకా ఏం స్పందించని జంతుప్రేమికులు
ఈ లీగ్‌ను తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్పు సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ పోటీలు జనవరి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్ రోడ్లో జరగనున్నాయి. అయితే ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహణ గురించి జల్లికట్టు క్రీడకు మొదట్నుంచి వ్యతిరేకత తెలియజేస్తున్న జంతుహక్కుల సంఘాలు ఇంకా ఏం స్పందించకపోవడం గమనార్హం.