టీచరమ్మ పాత్రలో కనిపించనున్న మెహ్రీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీచరమ్మ పాత్రలో కనిపించనున్న మెహ్రీన్

  • 25వ సినిమాకి రెడీ అవుతోన్న గోపీచంద్ 
  • ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్ 
  • దర్శకుడిగా చక్రి 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్
తెలుగు తెరపై గ్లామర్ కథానాయికగా మెహ్రీన్ మంచి మార్కులు కొట్టేసింది. ఇంతవరకూ చేసిన పాత్రలతో ఆమె కుర్రకారు హృదయాల్లో చోటు సంపాదించుకుంది. పెద్ద గ్యాప్ లేకుండా చకచకా తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోన్న మెహ్రీన్, తన తదుపరి సినిమాను గోపీచంద్ తో చేయనుంది. రాధామోహన్ నిర్మాణంలో చక్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది గోపీచంద్ కి 25వ సినిమా కావడం విశేషం.

 ఈ సినిమాలో మెహ్రీన్ .. టీచరమ్మ పాత్రలో కనిపిస్తుందట. ఈ తరహా పాత్రను చేయనుండటం ఇదే మొదటిసారి అనీ .. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని సన్నిహితులతో మెహ్రీన్ చెబుతోందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.    
gopichand
mehreen

More Telugu News