మీరిద్దరూ చాలా మంది పిల్లల్ని కనాలి... కోహ్లీ, అనుష్కలకు డివిలియర్స్ వీడియో సందేశం
- తాను ఆశ్చర్యానికి గురయ్యానని ప్రకటన
- ఇద్దరికీ అభినందనలు
- ఆనందంగా జీవించాలి అంటూ డివిలియర్స్ ఆశాభావం
‘‘పెళ్లి చేసుకున్నందుకు విరాట్, అనుష్కలకు అభినందనలు. నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే, ఏదో ఒక రోజు ఇలా చేస్తారని అనుకున్నాను. నా మంచి స్నేహితుడికి అభినందనలు. ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని, ఎక్కువ మంది పిల్లలను కంటారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ వీడియోలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లీ, డివిలియర్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు అనే విషయం తెలిసిందే.