గుజరాత్ ఎన్నికలు.. పోలింగ్ తర్వాత ఈవీఎంలను మరిచిపోయిన అధికారులు
- తొలి దశ పోలింగ్ తర్వాత ఘటన
- జీపులోనే ఈవీఎంలను మర్చిపోయిన అధికారుల
- షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్
ఈ సందర్భంగా ఒక యూనిట్ ను జీపులోనే మర్చిపోయారు. మరుసటి రోజు ఉదయం ఈవీఎంలను గుర్తించిన డ్రైవర్ ఆ విషయాన్ని వెంటనే స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆ ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని... అవన్నీ ఖాళీ ఈవీఎంలే అని తెలిపారు. ఏదైనా ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తితే, వెంటనే వినియోగించే నిమిత్తం ఆరు ఈవీఎంలను అదనంగా పంపామని చెప్పారు. ఈ ఆరు ఈవీఎంలలో మూడింటిని అధికారులు మర్చిపోయారని... వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.