బాలకృష్ణతో పోటీకి దిగుతోన్న సూర్య
- సూర్య 'గ్యాంగ్' ఫస్టులుక్
- జనవరి 12న విడుదల
- అదే రోజున బాలకృష్ణ 'జై సింహా' రిలీజ్
- గట్టిపోటీనే ఎదుర్కోనున్న సూర్య
సంక్రాంతి పండుగకి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. అయితే ఆ సమయంలో బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ సినిమాలు ఉండటంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ సూర్య సినిమా ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా రిలీజ్ డేట్ ను ఇచ్చేశారు. తమిళంతో పాటుగా తెలుగులోనూ జనవరి 12న విడుదల చేస్తున్నారు. గట్టిపోటీలో ఈ సినిమా రంగంలోకి దిగుతుండటం విశేషం.