హను రాఘవపూడి దర్శకుడిగా శర్వానంద్ న్యూ మూవీ ప్రారంభం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హను రాఘవపూడి దర్శకుడిగా శర్వానంద్ న్యూ మూవీ ప్రారంభం!

  • శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి సినిమా 
  • రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు 
  • కథానాయికగా సాయిపల్లవిని తీసుకునే ఛాన్స్
'అందాల రాక్షసి'తో పేరు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి, ఆ తరువాత 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో మంచి హిట్ కొట్టేశాడు. దాంతో ఆయన చేతికి 'లై' వంటి భారీ బడ్జెట్ చిత్రం వచ్చింది. అయితే, నితిన్ కెరియర్లోనే ఇది భారీ పరాజయంగా నిలిచింది. దాంతో ఇక ఇప్పట్లో హను రాఘవపూడికి అవకాశాలు రావడం కష్టమేనని అంతా అనుకున్నారు.

కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ వెంటనే ఆయనకి మరో ఛాన్స్ దక్కింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారు ఆయన దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. కొంతసేపటి క్రితం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ కొట్టగా .. శర్వానంద్ పై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.  
sharwanand
sai pallavi

More Telugu News