భారీ రేటుకు 'గరుడ వేగ' శాటిలైట్ రైట్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ రేటుకు 'గరుడ వేగ' శాటిలైట్ రైట్స్!

  • జెమినీ చేతికి 'గరుడ వేగ' శాటిలైట్ రైట్స్
  • 4 కోట్లు చెల్లించినట్టుగా సమాచారం 
  • ఇదే బ్యానర్ పై మరో సినిమా చేసే ఛాన్స్   
'ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు' అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది. వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వచ్చి డీలాపడిపోయిన రాజశేఖర్ కి, 'గరుడ వేగ' భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయి.

విడుదలకి ముందే శాటిలైట్ రైట్స్ అమ్మేసి ఉంటే 2 కోట్ల లోపే వచ్చి ఉండేవని అంటున్నారు. సినిమా హిట్ అయిన తరువాత శాటిలైట్ రైట్స్ అమ్మకానికి సిద్ధపడటం కలిసొచ్చింది. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఈ రోజు అగ్రిమెంట్ కి సంబంధించిన పనులను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ ఇదే బ్యానర్ పై మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి.  
rajasekhar
pooja kumar

More Telugu News