రొమాంటిక్ హీరోగా శర్వానంద్ .. నేపాల్ షెడ్యూల్ కి రెడీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రొమాంటిక్ హీరోగా శర్వానంద్ .. నేపాల్ షెడ్యూల్ కి రెడీ!

  • హను రాఘవపూడితో శర్వానంద్ 
  • రొమాంటిక్ టచ్ తో కూడిన కథాంశం 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • నేపాల్ కి బయల్దేరనున్న టీమ్  
'మహానుభావుడు'తో మరోసారి పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి శర్వానంద్ సక్సెస్ ను సాధించాడు. ఈ సినిమా తరువాత ఆయన రెండు ప్రాజెక్టులు చేయడానికి అంగీకరించాడు. ఈ రెండు సినిమాల షూటింగులు సమాంతరంగా కొనసాగనున్నాయి. ఒక సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడైతే .. మరో సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు.

 'లై' సినిమా పరాజయంపాలైనా, హను రాఘవపూడికి శర్వానంద్ ఛాన్స్ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో శర్వానంద్ రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. శర్వానంద్ జోడీగా సాయిపల్లవిని ఆల్రెడీ ఎంపిక చేసేశారు. 'ఫిదా' తో హిట్ కొట్టిన సాయిపల్లవి, నానితో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తోంది. శర్వానంద్ తో చేస్తున్నది ఆమెకి మూడవ సినిమా అవుతుంది. కథా పరంగా ఈ సినిమా షూటింగ్ నేపాల్ లో ఎక్కువగా జరపనున్నారట. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుందని సమాచారం.     
sharwanand
saipallavi

More Telugu News