'2.0' టీజర్ .. ట్రైలర్ రిలీజ్ వాయిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'2.0' టీజర్ .. ట్రైలర్ రిలీజ్ వాయిదా!

  • హైదరాబాద్ లో జరగవలసిన '2.0' టీజర్ రిలీజ్ 
  • చెన్నై లో నిర్వహించవలసిన ట్రైలర్ రిలీజ్ 
  • జనవరి 25న సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు తక్కువ 
  • అందుకే వాయిదా వేశారంటూ ప్రచారం    
ఒక వైపున రజనీ అభిమానులు .. మరో వైపున అక్షయ్ ఫ్యాన్స్ '2.0' సినిమా కోసం ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను ఇటీవలే 'దుబాయ్' లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోను .. ట్రైలర్ ను చెన్నై లోను విడుదల చేయనున్నట్టు చెప్పారు.

 ఈ సినిమా టీమ్ చెప్పిన ప్రకారం ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లో టీజర్ రిలీజ్ చేయవలసి వుంది. కానీ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రజనీకాంత్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, డిసెంబర్ 12వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. కానీ ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడం వలన, ముందుగా చెప్పినట్టుగా జనవరి 25న సినిమాను విడుదల చేయలేకపోవచ్చట. అందువల్లనే టీజర్ రిలీజ్ ను .. ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది.         
rajanikanth
akshay kumar

More Telugu News