'గరుడ వేగ' షూటింగుకి ముందే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది .. అమ్మా నాన్న భయపడిపోయారు!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గరుడ వేగ' షూటింగుకి ముందే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది .. అమ్మా నాన్న భయపడిపోయారు!: రాజశేఖర్

  • షూటింగ్ వారం రోజులు ఉందనగా హార్ట్ ఎటాక్ వచ్చింది 
  • 3 నెలల తరువాత షూటింగ్ పెట్టుకోమని అమ్మానాన్నలు అన్నారు
  • స్టెంట్ వేసిన 10వ రోజునే షూటింగ్ కి వెళ్లిపోయాను
  • దాంతో వాళ్లు చాలా టెన్షన్ పడిపోయారు
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ 'గరుడవేగ' సినిమా విషయాలను .. ఈ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. " ఈ సినిమా వారం .. పది రోజుల్లో మొదలవుతుందనగా నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది .. దాంతో స్టెంట్ వేశారు. ఈ సినిమాలో హీరో పాత్రకి చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉందని అంటున్నారు .. 3 నెలల తరువాతనే షూటింగ్ పెట్టుకోమని అమ్మానాన్నలు చెప్పారు"

"కానీ స్టెంట్ వేసిన పది రోజులకే నేను షూటింగ్ కి వెళ్లిపోయాను. నేను ఒక డాక్టర్ ను కాబట్టి .. ఏయే ప్రికాషన్స్ తీసుకోవాలో నాకు తెలుసు. కానీ అమ్మానాన్నలు చాలా బాధపడ్డారు .. భయపడ్డారు. ఈ సినిమా టీజర్ లో నన్ను చూసి "బాగానే వున్నావ్ రా" అని అమ్మ అన్నారు. టీజర్ కి వస్తోన్న రెస్పాన్స్ తో అంతా అభినందిస్తూ ఉంటే ఆనందించారు. సొంత సినిమా చేయనని అమ్మకు మాట ఇచ్చాను గానీ, ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో నేను కూడా ఇన్వాల్వ్ కావలసి వచ్చింది" అని అన్నారు.    
rajasekhar
poojakumar

More Telugu News