సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • శర్వానంద్ కి జోడీగా కాజల్ 
  • రెగ్యులర్ షూటింగులో 'సవ్యసాచి' 
  • వచ్చే ఏడాది దర్శకుడిగా మరో రచయిత
  • ఆ ప్రాజక్ట్ వదులుకున్న సునీల్
*  వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ నటించనున్నట్టు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించే చిత్రంలో ఇద్దరు నాయికలు వుంటారు. ఇప్పటికే ఓ నాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేశారు. ఇక ప్రధాన నాయిక పాత్ర కోసం కాజల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.  
*  నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సవ్యసాచి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాదు శివారులో జరుగుతోంది. చిలుకూరు సమీపంలో వేసిన సెట్స్ లో నిన్నటి నుంచి పదిహేను రోజుల పాటు తొలి షెడ్యూలు జరుగుతుందని దర్శకుడు చెప్పారు. మాధవన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నాయికగా నటిస్తోంది.
*  తాను కూడా దర్శకుడిగా మారుతున్నట్టు ప్రముఖ రచయిత గోపీమోహన్ ఆమధ్య ప్రకటించిన సంగతి విదితమే. కాగా, తన చిత్రానికి కథ సిద్ధమైందని, ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని గోపీమోహన్ చెప్పారు.
*  ప్రస్తుతం ఎన్.శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న హాస్య కథానాయకుడు సునీల్ ఇటీవల గోపీ గణేష్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సునీల్ చేయడం లేదు. ఈ ప్రాజక్టు ఆగిపోవడానికి కారణాలు తెలియాల్సివుంది.        
Kajal
sharwanand
chaitanya

More Telugu News