రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో .. నా కూతురు ప్రాణాలు కాపాడారు : హీరో సునీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజశేఖర్ నా ఫేవరేట్ హీరో .. నా కూతురు ప్రాణాలు కాపాడారు : హీరో సునీల్

  • 'గరుడ వేగ' సక్సెస్ పట్ల సునీల్ ఆనందం 
  • రాజశేఖర్ కి అభినందనలు 
  • ఆయన నా అభిమాన హీరో 
  • రియల్ లైఫ్ లోను నాకు హెల్ప్ చేశారు
దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు సరైన హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇక హీరోగా రాజశేఖర్ చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ ఇప్పుడు 'గరుడ వేగ' సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అలా తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ లో ఈ సినిమా టీమ్ పాల్గొంది. వాళ్లతో పాటు ఈవెంట్ లో సునీల్ కూడా పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'గరుడవేగ' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్ కి అభినందనలు తెలియజేశాడు. రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఒక హీరోగానే కాదు మనసున్న మనిషిగా ఆయనని ఇష్టపడతానని చెప్పాడు. 'రియల్ లైఫ్ లోను ఆయన నాకెంతో హెల్ప్ చేశారు .. ఒకసారి నా కూతురికి బాగోలేనప్పుడు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు' అన్నాడు. రాజశేఖర్ టీమ్ తో కలిసి క్రిస్ మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.       
rajasekhar
pooja kumar

More Telugu News