నెటిజ‌న్ల‌కు పెద్ద‌గా రుచించ‌ని రోబో 2.0 కొత్త పోస్ట‌ర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెటిజ‌న్ల‌కు పెద్ద‌గా రుచించ‌ని రోబో 2.0 కొత్త పోస్ట‌ర్‌!

  • పోస్ట‌ర్ బాగోలేదంటూ కామెంట్లు
  • ఆడియో మాత్రం బాగుంద‌ని కితాబు
  • ఇటీవ‌ల విడుద‌లైన ఆడియో
విడుద‌ల తేదీ గురించి ఇంకా స్ప‌ష్ట‌త లేని `రోబో 2.0` సినిమాకు సంబంధించి మ‌రో కొత్త పోస్ట‌ర్ విడుద‌లైంది. అయితే ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్ల‌కు పెద్ద‌గా రుచించ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన వాటిలో చెత్త పోస్ట‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌లో హీరోయిన్ అమీ జాక్స‌న్ రోబో, హీరో ర‌జ‌నీకాంత్ చిట్టి రోబోలు క‌లిసి ఏదో పాట‌కు డ్యాన్స్ చేస్తున్న‌ట్లుగా ఉంది. అయితే పోస్ట‌ర్ క‌ల‌ర్ కాంబినేష‌న్ బాగోలేద‌ని అభిమానులు అంటున్నారు.

మ‌రోవైపు ఆడియో గురించి మాట్లాడుతూ... రెహ‌మాన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడ‌ని మెచ్చుకున్నారు. పాట‌లు ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్‌కి త‌గ్గ‌ట్లుగా ఉన్నాయ‌ని కొనియాడారు. ఇటీవ‌ల ఈ చిత్ర ఆడియోను దుబాయ్‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆడియో విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో ఆడియో విజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ దివాలీకి ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా.. ఇంకా విడుద‌ల‌పై మాత్రం అధికారికంగా ప్రకటన రాలేదు.  
lyca productions
robo 2.0
shankar
rajnikanth
amy jackson
akshay kumar

More Telugu News