దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రపంచ రికార్డు.. టీ 20ల్లో అతివేగవంతమైన శతకం నమోదు చేసిన డేవిడ్ మిల్లర్!
- టీ20ల్లో తొలి సెంచరీతోనే రికార్డులకెక్కిన మిల్లర్
- బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేసిన వైనం
- రిచర్డ్ లెవీ రికార్డు బద్దలు
కాగా, ఇదే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా కూడా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 85 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బోల్తా పడింది. 18.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో రెండు టీ20ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది.