హను రాఘవపూడికి ఓకే చెప్పిన శర్వానంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హను రాఘవపూడికి ఓకే చెప్పిన శర్వానంద్

  • నితిన్ తో 'లై' చేసిన హను రాఘవపూడి 
  • భారీ ప్లాప్ గా నిలిచిన 'లై'
  • తాజాగా శర్వానంద్ కి లైన్ చెప్పిన హను
  • మరో సినిమాను కేన్సిల్ చేసుకున్న శర్వానంద్
'అందాల రాక్షసి' సినిమాతో దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్న హను రాఘవపూడి, ఆ తరువాత 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ మధ్య నితిన్ తో చేసిన 'లై' సినిమా మాత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. దాంతో హను రాఘవపూడికి నెక్స్ట్ ఛాన్స్ రావడానికి చాలా సమయం పట్టొచ్చనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి.

అయితే ఆయనకి  శర్వానంద్ ఛాన్స్ ఇచ్చాడనేది తాజా సమాచారం. శర్వానంద్ తదుపరి సినిమాలు సుధీర్ వర్మతోను .. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ దర్శకత్వంలోను ఉండనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ రెండింటిలో ప్రకాశ్ ప్రాజెక్టును శర్వానంద్ కేన్సిల్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ ప్లేస్ లోనే ఆయన హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్నాడని అంటున్నారు. హను రాఘవపూడి ఒక లైన్ వినిపించడం .. శర్వానంద్ ఓకే చెప్పడం జరిగిపోయాయని చెబుతున్నారు.          
sharwanand

More Telugu News