రోబో 2.0 ఆడియో విడుద‌ల వేడుక హైలైట్స్‌... ఫొటోలు, వీడియోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోబో 2.0 ఆడియో విడుద‌ల వేడుక హైలైట్స్‌... ఫొటోలు, వీడియోలు

  • అదిరిపోయిన డ్యాన్సులు, న‌టీన‌టుల‌ ఎంట్రీలు
  • దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వేడుక‌
  • తెలుగు వ్యాఖ్యాత‌గా రానా
దుబాయ్‌లోని బుర్జు పార్క్‌లో `రోబో 2.0` చిత్ర ఆడియో విడుద‌ల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల ఆడియోల‌ను ఒకే వేదిక మీద విడుద‌ల చేశారు. తెలుగు భాగానికి ద‌గ్గుబాటి రానా, హిందీ భాగానికి క‌ర‌ణ్ జొహార్‌, త‌మిళ భాగానికి ఆర్జే బాలాజీలు వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ర‌జ‌నీకాంత్ ఎంట్రీ కార్య‌క్ర‌మానికి హైలైట్‌గా నిలిచింది. అక్ష‌య్ కుమార్‌, అమీ జాక్స‌న్‌ల ఎంట్రీలు, డ్యాన్స్‌లు ఆక‌ట్టుకున్నాయి.

వేడుక‌లో భాగంగా ర‌జనీకాంత్‌ని ఓ తెలుగు డైలాగ్ చెప్పాల‌ని రానా కోరాడు. దానికి ర‌జ‌నీ `భాషా` చిత్రంలోని `నేను ఒక్క‌సారి చెబితే వంద సార్లు చెప్పిన‌ట్లే` అనే డైలాగ్ చెప్పడంతో సభ చప్పట్లతో దద్దరిల్లింది. అక్ష‌య్ కుమార్ త‌న ఎంట్రీని ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకున్నారు. అలాగే ఈ వేడుక‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన వారు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో వీడియోలు, పోస్టులు, ఫొటోలు పెట్టారు.
 
robo 2.0
dubai
burj park
akshay kumar
amy jackson
rajnikanth

More Telugu News