ఇటు విజయం.. అటు విధ్వంసం...వీడియో చూడండి!
- ఐఎస్ఐఎస్ ఖలీఫా రాజ్యానికి రాజధాని రక్కా నగరం
- నాలుగు నెలలపాటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరాడిన కుర్దు, అరబ్ వీరులు
- శిథిలమైన భవనాలు, తుపాకి తూటాలకు రంధ్రాలు పడిన గోడలే యుద్ధ సాక్ష్యాలు
ఈ క్రమంలో రక్కాలో ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో సిరియా ప్రజాస్వామ్య దళం ( ఎస్డీఎఫ్) గాలింపు చేపట్టింది. ఈ సందర్భంగా రక్కా నగరం ఛిద్రమైపోయిన దృశ్యం రెండు వర్గాల మధ్య పోరును కళ్లకు కడుతోంది. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. దాడులను తట్టుకుని నిలిచిన ప్రతి భవనం గోడ తుపాకీ తూటాలను తట్టుకుని, మాయని గాయాలను ప్రపంచానికి చాటుతోంది. యుద్ధం మిగిల్చిన విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి.