తెలుగులోకి మమితా బైజు మలయాళ హిట్ మూవీ!
- మలయాళ మూవీగా 'బెత్లేహం కుటుంబ యూనిట్'
- నవీన్ పౌలి జోడీగా అలరించిన మమితా బైజు
- ఈ నెల 21వ తేదీన విడుదలైన సినిమా
- 60 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
- సెప్టెంబర్ 4 నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు
'ప్రేమలు' సినిమా నుంచి మమితా బైజు తన జోరును కొనసాగిస్తూ వెళుతోంది. ఒక్కొక్కటిగా ఆమె భారీ ప్రాజెక్టులు థియేటర్స్ కి వస్తున్నాయి. ఆమె నటనకు మంచి మార్కులు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి మమితా బైజు, రీసెంటుగా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా పేరే 'బెత్లేహం కుటుంబ యూనిట్'. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి గిరీశ్ దర్శకత్వం వహించాడు. నిర్మాతలలో ఒకరిగా ఫహాద్ ఫాజిల్ వ్యవహరించిన సినిమా ఇది.
మలయాళంలో నవీన్ పౌలికి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు .. సహజమైన ఆయన నటనే అందుకు కారణమని చెప్పాలి. ఓటీటీ సినిమాల కారణంగా ఇతర భాషలలోను ఆయనకి అభిమానులు ఉన్నారు. అలాంటి నివిన్ పౌలి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఆయన జోడీగా మమితా బైజు నటించిన ఈ సినిమా, అక్కడి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి మద్దతు లభిస్తోంది.
విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదల చేశారు. 60 కోట్లకి పైగా వసూళ్లతో ఈ సినిమా అక్కడ తన దూకుడు చూపిస్తోంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను, తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. మరి ఈ సినిమా ఇక్కడి థియేటర్ల వైపు నుంచి ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.