పాలు, పనీర్ ప్యాకెట్ ఉబ్బిందా? అసలు కారణం ఇదే.. తింటే ప్రమాదమే!
- ఉబ్బిన పాల, పనీర్ ప్యాకెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటున్న నిపుణులు
- సూక్ష్మజీవుల వల్ల వాయువులు ఏర్పడడమే ఉబ్బడానికి కారణం
- చల్లని ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయకపోయినా సమస్య
- పాడైన ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు
- ఉబ్బిన ప్యాకెట్‌ను తెరిచి రుచి చూడకపోవడమే బెటర్
ఫ్రిజ్‌లో పెట్టిన పాల ప్యాకెట్ లేదా పనీర్ ప్యాకెట్ ఒక్కసారిగా ఉబ్బిపోయి కనిపించడం చాలామంది గమనించే విషయమే. ఎక్స్‌పైరీ డేట్ ఇంకా ఉండటంతో దాన్ని అలాగే తినేస్తుంటారు. కానీ ప్యాకెట్ సాధారణంగా ఉండాల్సిన దానికంటే గట్టిగా, బెలూన్‌లా ఉబ్బితే మాత్రం జాగ్రత్త అవసరం. ఇలాంటి మార్పు ఆహారంలో ఏదో సమస్య తలెత్తిందనడానికి సంకేతం కావచ్చు.
ప్యాకెట్ ఎందుకు ఉబ్బుతుంది?
దీనికి ప్రధాన కారణాల్లో సూక్ష్మజీవుల పెరుగుదల ఒకటి. పాలు, పనీర్ వంటి తేమ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తుల్లో సరైన ఉష్ణోగ్రతలు లేకపోతే కొన్ని బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు పెరగొచ్చు. ఇవి ఆహారంలోని కొన్ని పదార్థాలను విచ్ఛిన్నం చేసే సమయంలో వాయువులను ఉత్పత్తి చేస్తాయి. సీల్ చేసిన ప్యాకెట్‌లో ఆ వాయువులు బయటకు వెళ్లలేకపోవడంతో ప్యాకెట్ ఉబ్బుతుంది. పనీర్‌లో ఉండే స్వల్ప లాక్టోస్ కూడా కొన్ని పరిస్థితుల్లో సూక్ష్మజీవుల చర్యకు లోనై వాయువుల ఉత్పత్తికి కారణమవుతుంది.
అయితే ప్రతిసారీ సూక్ష్మజీవులే కారణమని చెప్పలేం. రవాణాలో సరైన చల్లని ఉష్ణోగ్రతలు పాటించకపోవడం, దుకాణంలో సరిగ్గా నిల్వ చేయకపోవడం, ప్యాకెట్ సీల్‌లో చిన్న లోపాలు ఉండటం వంటి కారణాలతోనూ సమస్య రావచ్చు. అందుకే ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే ఆహారం సురక్షితమని చెప్పే ప్రమాణం కాదు.
అలాంటి ప్యాకెట్ తింటే ఏమవుతుంది?
ప్యాకెట్ ఉబ్బడం అంటే అందులో చెడిపోయే ప్రక్రియ మొదలైందనే హెచ్చరికగా తీసుకోవాలి. అలాంటి ఆహారం తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఉబ్బిన ప్యాకెట్‌ను తెరిచి వాసన చూడటం లేదా కొద్దిగా రుచి చూడటం కూడా చేయకపోవడం మంచిది.
ఉబ్బకుండా ఉండాలంటే?
వినియోగదారుల పరంగా ముఖ్యమైన జాగ్రత్త సరైన నిల్వ. పాలు, పనీర్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసిన వెంటనే నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో పెట్టాలి. బయట ఎక్కువసేపు ఉంచకూడదు. కొనేటప్పుడు ప్యాకెట్ సీల్ బాగుందా? ఉబ్బిందా? లీక్ అవుతోందా? అని పరిశీలించాలి. అసాధారణంగా కనిపించే ప్యాకెట్‌ను కొనకపోవడమే సురక్షితం.