'తెల్లగా ఉన్నావన్న పొగరా?' అంటూ తమన్నాను ప్రశ్నించిన అభిమాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తెల్లగా ఉన్నావన్న పొగరా?' అంటూ తమన్నాను ప్రశ్నించిన అభిమాని!

  • సోషల్ మీడియా చర్చలో తమన్నాను నిలదీసిన అభిమాని
  • కూల్ గా సమాధానం చెప్పిన తమ్మూ 
  • డ్యాన్స్ ప్రధాన సినిమాలో నటించాలని ఉందన్న మిల్కీ బ్యూటీ 
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమాన తారలతో నేరుగా మాట్లాడే అవకాశం అభిమానులకు కలుగుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లైవ్ ఛాట్ తో ఆకట్టుకుంటూ ఆయా తారలు తమ అభిమానులను మరింత అలరిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటి తమన్నా అభిమాలనులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.

అందులో ఒక అభిమాని ‘తెల్లగా ఉన్నావని పొగరా? నాకు రిప్లై ఇవ్వడం లేదు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమన్నాను ప్రశ్నించాడు. అయితే దీనిని లైట్ తీసుకున్న తమన్నా ‘అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ సమాధానం చెప్పింది.

అనంతరం తాను చేస్తున్న, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి అభిమానులకు వివరించింది. ఆ సందర్భంగానే ‘‘సినిమాలు లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందే సినిమాలో నటించాలనేది నా డ్రీమ్‌’’ అంటూ వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నారు. 
tamannah
fan's
new movie
offers

More Telugu News