వెండితెరపై మరో బయోపిక్... ఈసారి శాస్త్రవేత్త జీవితకథ
- ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్ జీవితంపై సినిమా
- దర్శకత్వం వహించనున్న నిఖిల్ అడ్వాణీ
- `మై ఒడిస్సీ` పుస్తకం స్ఫూర్తి
మంగళ్‌యాన్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన రాధాకృష్ణన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆయన జీవితంపై సినిమా తీయాలనే ఆలోచన కలిగిందని ఆయన పేర్కొన్నారు. రాధాకృష్ణన్ రాసిన `మై ఒడిస్సీ` పుస్తకం తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని నిఖిల్ చెప్పారు. ఎమ్మె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనిపై రాధాకృష్ణన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదగడానికి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ రావాల్సి వచ్చిందని, ఆ సంగతులన్నీ సినిమాగా చూపిస్తే యువతకు ఆదర్శంగా ఉంటుందని రాధాకృష్ణన్ చెప్పారు.