నెక్స్ట్ మూవీకి రెడీ అవుతోన్న శర్వానంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతోన్న శర్వానంద్

  •  'స్వామి రారా' దర్శకుడితో శర్వానంద్
  •  హారిక హాసిని బ్యానర్ పై నిర్మాణం
  •  ఈ నెలలోనే సెట్స్ పైకి
విభిన్న చిత్రాల కథానాయకుడిగా శర్వానంద్ కి మంచి పేరుంది. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆయనకి మంచి క్రేజ్ వుంది. పెద్ద హీరోలతో తలపడి విజయం సాధిస్తూ వస్తోన్న నేపథ్యం వుంది. అలాంటి శర్వానంద్ మరో వైవిధ్యభరితమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన మొదటిసారిగా ఈ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. శర్వానంద్ తో పాటు దర్శకుడు సుధీర్ వర్మ కూడా వరుస హిట్స్ తో వున్న కారణంగా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి రేకెత్తే ఛాన్స్ వుంది.     
sharwanand

More Telugu News