33 ఏళ్ల చిరకాల వాంఛ తీరిందంటున్న ఖుష్బూ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

33 ఏళ్ల చిరకాల వాంఛ తీరిందంటున్న ఖుష్బూ!

  • 33 ఏళ్ల నిరీక్షణ తరువాత తన అభిమాన క్రికెట్ స్టార్ ను కలిసిన ఖుష్బూ
  • చెపాక్ మ్యాచ్ సందర్భంగా రవిశాస్త్రిని కలిసిన ఖుష్బూ
  • రవిశాస్త్రికి వీరాభిమానినని చెప్పిన ఖుష్బూ
  • రవిశాస్త్రితో దిగిన ఫోటో పోస్టు చేసిన ఖుష్బూ
తమిళనాట ఖుష్బూకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుష్బూకు అక్కడి అభిమానులు ఏకంగా గుడి కట్టి, పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అంతటి అభిమానగణాన్ని సంపాదించుకున్న ఖుష్బూ కూడా ఒకరికి అభిమాని. గత 33 ఏళ్లుగా తన అభిమాన స్టార్ ను కలవాలని తపించింది. అయితే తొలినాళ్లలో సినిమాల్లో బిజీగా ఉండడం, తరువాత కుటుంబం, రాజకీయాలతో బిజీగా మారడంతో ఆమెకు ఆ అవకాశం లభించలేదు.

తాజాగా ఆమె తన అభిమాన స్టార్ ను కలుసుకుంది. టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రికి ఖుష్బూ పెద్ద అభిమాని, ఆయనను కలవాలని చాలా సార్లు అనుకుంది. అయితే కుదర్లేదు. తాజాగా చెపాక్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా తొలిసారి తన అభిమాన క్రికెట్ స్టార్ ను కలిసింది. ఈ విషయం తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను పోస్టు చేసింది. 
RAVI SASHTRI
KHUSHBOO
CHEPAK MATCH

More Telugu News