రవితేజ కొత్త సినిమా టైటిల్ ట్రాక్ విడుదల తేదీ ఖరారు!
- ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు విడుదల
- అభిమానుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానన్న దర్శకుడు
ఈ రోజు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై స్పందిస్తూ ఓ ప్రకటన చేశాడు. ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ను ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పాడు. అభిమానుల స్పందన కోసం ఎదురుచూస్తూ ఉన్నానని పేర్కొన్నాడు. రవితేజ విభిన్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండడం పట్ల ఆయన అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.