'మహానుభావుడు' ఆడియో రిలీజ్ డేట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానుభావుడు' ఆడియో రిలీజ్ డేట్!

మారుతి .. శర్వానంద్ కాంబినేషన్లో 'మహానుభావుడు' సినిమా రూపొందింది. ఇటలీ .. ఆస్ట్రియా .. క్రొయేషియా .. వంటి విదేశాల్లోను షూటింగ్ జరిపారు. అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు .. పాటలు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయని చెబుతున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 16వ తేదీన నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. తమన్ అందించిన సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. విజయదశమికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే నానితో కలిసి ఒక హిట్ కొట్టేసిన మెహ్రీన్, శర్వానంద్ జోడీగా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి. 
sharwanand
mehreen

More Telugu News