రిలీజ్ కి రెడీ అవుతోన్న 'కథలో రాజకుమారి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలీజ్ కి రెడీ అవుతోన్న 'కథలో రాజకుమారి'

విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కథలో రాజకుమారి' ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

 నారా రోహిత్ సరసన ఈ సినిమాలో నమితా ప్రమోద్ .. నందిత నటించారు. పరిణతి చెందిన ప్రేమకథాంశంగా ఈ సినిమా తెరకెక్కిందనీ, అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నారా రోహిత్ వున్నాడు. 
nara rohith
namitha pramod

More Telugu News