విజయ్ దేవరకొండ తరువాత శర్వానంద్ తోనేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ దేవరకొండ తరువాత శర్వానంద్ తోనేనట!

'అర్జున్ రెడ్డి' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో, ఈ కథను ముందుగా శర్వానంద్ కి వినిపించడం జరిగిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వలన శర్వానంద్ ఈ సినిమా చేయలేకపోయాడనీ, అందువలన విజయ్ దేవరకొండతో తెరకెక్కించానని అన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న విడుదల కావడం .. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది.

 యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ క్రమంలో శర్వానంద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి' కి వచ్చిన సక్సెస్ టాక్ చూసిన శర్వానంద్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడట. దాంతో ఆయన హీరోగా తన సొంత బ్యానర్లో మరో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడని అంటున్నారు. 
sharwanand
sandeep

More Telugu News