'స్పైడర్' రిలీజ్ రోజునే మహేశ్ సోదరి మూవీ ట్రైలర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'స్పైడర్' రిలీజ్ రోజునే మహేశ్ సోదరి మూవీ ట్రైలర్!

ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందకపోయినా, సందీప్ కిషన్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మహేశ్ సోదరి మంజుల దర్శకత్వం వహించే ఒక సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాతోనే ఆమె దర్శకురాలిగా పరిచయమవుతోంది.

 అందమైన ప్రేమకథగా ఆమె ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. సందీప్ కిషన్ సరసన కథానాయికలుగా అమైరా దస్తూర్ .. త్రిథా చౌదరి నటిస్తున్నారు. మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా రిలీజ్ రోజైన 'సెప్టెంబర్ 27నే .. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారట. దర్శకురాలిగా మంజుల తొలి సక్సెస్ ను అందుకోవడమే కాకుండా, ఫ్లాపులతో సతమతమవుతోన్న సందీప్ కిషన్ కి కూడా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.  
sundeep kishan
amyra

More Telugu News