సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న 'సంఘమిత్ర' భారీ చిత్రంలో కథానాయిక ఇంకా ఎంపిక కాలేదు. శ్రుతిహాసన్ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఎవరూ ఖరారు కాలేదు. హన్సిక నటిస్తుందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ, ఆమె చేయడం లేదని హన్సిక సన్నిహితులు తాజాగా పేర్కొన్నారు.
*  వరుణ్ తేజ్ చేసిన తాజా హిట్ సినిమా 'ఫిదా' ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సంగతి విదితమే. తన తదుపరి చిత్రాన్ని కూడా వరుణ్ ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే చేయనుండడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన చేస్తున్న తాజా చిత్రం లండన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగును లండన్ లో ప్లాన్ చేస్తున్నారు.
*  ధనుష్ తాజా చిత్రం 'వీఐపి 2' తమిళనాట ఈ నెల 11న రిలీజవుతోంది. ఇక తెలుగు వెర్షన్ ను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు హీరో ధనుష్ ప్రకటించాడు. ఇందులో అమలాపాల్ కథానాయికగా నటించింది. గతంలో వచ్చిన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి ఇది సీక్వెల్.   
Hansika
amalapaul

More Telugu News