అదంతా అవాస్తవమేనంటూ రూమర్స్ ను కొట్టిపారేసిన గోపీచంద్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదంతా అవాస్తవమేనంటూ రూమర్స్ ను కొట్టిపారేసిన గోపీచంద్!

గోపీచంద్ చేసిన 'ఆక్సిజన్' సినిమా విడుదల కాకపోవడంతో, ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అయినట్టుగా అనిపిస్తోంది. దాంతో ఆయన కూడా 'గౌతమ్ నంద ' సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనీ .. ఒక రేంజ్ లో ఆడితే తప్ప లాభాలు రావనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని గురించి గోపీచంద్ స్పందిస్తూ .. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పాడు. రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ రూపంలో అంతా వచ్చేసిందని అన్నాడు. సంపత్ నంది కథ చెప్పినప్పుడే సక్సెస్ ఖాయమనే నమ్మకం కలిగిందనీ .. అది పెరుగుతూ వచ్చిందే గానీ .. తగ్గలేదని చెప్పాడు. గతంలో కథల ఎంపికలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాననీ .. ఇకపై అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో వున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హన్సిక .. కేథరిన్ కథానాయికలనే సంగతి తెలిసిందే.   
gopichand
hansika

More Telugu News