టీచర్లపై దాడి నిందితులను వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్‌ మాస్‌ వార్నింగ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీచర్లపై దాడి నిందితులను వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్‌ మాస్‌ వార్నింగ్‌

Nara Lokesh warns of strict action against those who attacked teachers
  • స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై దాడికి దిగారంటూ లోకేశ్‌ ఆగ్రహం
  • దైవం వంటి గురువులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
  • దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను జగన్‌ అవమానిస్తున్నారని ఆరోపణ
  • రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను టీచర్లపైకి ఉసిగొల్పారని విమర్శ
  • ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల జోలికి రావొద్దని హితవు
విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడికి వైసీపీ ముఠాలు దాడికి దిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఫేక్‌ ఆరోపణలు చేసినప్పుడే జగన్‌ దుర్బుద్ధి బయటపడిందని లోకేశ్‌ విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి టీచర్‌ ఉద్యోగాలు సాధించిన వారిని వైసీపీ అవమానిస్తోందని ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలంటూ స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని లోకేశ్‌ తెలిపారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీచర్లపై దాడికి దిగారని ఆరోపించారు.

రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను టీచర్లపైకి ఉసిగొల్పారని లోకేశ్‌ ఆరోపించారు. గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమని అన్నారు.

టీచర్లపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలని సూచించారు.
Advertisement
Nara Lokesh
DSC 2025 Teachers
YSRCP Attack
Andhra Pradesh Education Minister
Sports Quota Teachers
SAAP Office Incident

More Telugu News