మంగళగిరి అభివృద్ధి కోసం డాంగే కృషి చిరస్మరణీయం: లోకేశ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంగళగిరి అభివృద్ధి కోసం డాంగే కృషి చిరస్మరణీయం: లోకేశ్‌

Satyakrupal Dange efforts for Mangalagiri development are unforgettable says Nara Lokesh
  • చేనేత బంధు, జై ఆంధ్ర ఉద్యమకారుడు సత్యకృపాల్‌ డాంగే మృతి 
  • డాంగే మృతి పట్ల మంత్రి నారా లోకేశ్‌ సంతాపం 
  • చేనేత, స్వర్ణకారుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారని వెల్లడి
మంగళగిరికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, చేనేత బంధు, జై ఆంధ్ర ఉద్యమకారుడు సత్యకృపాల్‌ డాంగే మృతి పట్ల రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్‌ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన డాంగే.. మంగళగిరి అభివృద్ధితో పాటు చేనేత, స్వర్ణకారుల సంక్షేమం కోసం తన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని లోకేశ్‌ కొనియాడారు.

తన రికార్డు స్థాయి విజయానికి డాంగే కూడా ఒక ముఖ్య భాగస్వామిగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏ సంఘం బాధ్యతలు స్వీకరించినా నిబద్ధత, సేవా దృక్పథంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాంగే ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని లోకేశ్‌ పేర్కొన్నారు.
Advertisement
Satyakrupal Dange
Nara Lokesh
Mangalagiri Development
Handloom Workers Welfare
Jai Andhra Movement
Social Activist Death

More Telugu News