నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... ఏఎస్సై సురేశ్ రెడ్డి దుర్మరణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... ఏఎస్సై సురేశ్ రెడ్డి దుర్మరణం

Terrible road accident in Nandyal district ASI Suresh Reddy dies
  • నంద్యాల-కర్నూలు జాతీయ రహదారిపై ప్రమాదం
  • ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్సై సురేశ్ రెడ్డి అక్కడిక్కడే మృతి
  • టైరు పేలడంతో అదుపుతప్పిన క్రెటా కారు
  • మరో నలుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల-కర్నూలు జాతీయ రహదారిపై పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ రెడ్డి, మరికొందరితో కలిసి అనంతపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న క్రెటా కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేశ్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆయన గతంలో నంద్యాల, పాణ్యం పోలీస్ స్టేషన్లలో కూడా విధులు నిర్వర్తించారు.

కారులో ఉన్న ఎస్‌బీ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, ఈ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Suresh Reddy
Nandyal road accident
Andhra Pradesh ASI death
Panyam highway mishap
Allagadda Rural Police
Nandyal Kurnool National Highway

More Telugu News