నిజమైన ప్రేమ కొండలను కదిలించడమే కాదు... ఎస్కలేటర్లను కూడా నిర్మిస్తుంది: నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజమైన ప్రేమ కొండలను కదిలించడమే కాదు... ఎస్కలేటర్లను కూడా నిర్మిస్తుంది: నారా లోకేశ్

Nara Lokesh says true love builds escalators not just move mountains
  • భార్య మెట్లు ఎక్కలేకపోతోందని ఇంట్లోనే ఎస్కలేటర్ నిర్మించిన భర్త
  • తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివ నారాయణ రెడ్డి వినూత్న ఆవిష్కరణ
  • ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • ఈ ఆవిష్కరణపై స్పందిస్తూ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల ట్వీట్
భార్యపై ప్రేమతో ఓ భర్త చేసిన వినూత్న ఆవిష్కరణపై ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. నిజమైన ప్రేమ కొండలను కదిలించడమే కాదు, కొన్నిసార్లు ఎస్కలేటర్లను కూడా నిర్మిస్తుందని ఆయన కొనియాడారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యేకతను వివరిస్తూ లోకేశ్ శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివ నారాయణ రెడ్డి అనే వ్యక్తి భార్య మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించారు. ఆమె కష్టాన్ని చూడలేక, తన ప్రేమను వినూత్న ఆవిష్కరణగా మార్చారు. ఇంట్లోనే తన భార్య కోసం ప్రత్యేకంగా ఓ ఎస్కలేటర్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయి, నెటిజన్ల ప్రశంసలు అందుకుంది.

ఈ వైరల్ వీడియోను నారా లోకేశ్ కూడా తన ఖాతాలో పంచుకున్నారు. "భార్య మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే, సత్తి శివ నారాయణ రెడ్డి తన ఆరాధనను ఆవిష్కరణగా మార్చి ఆమె కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్ రూపొందించారు. ప్రేమను కొలవడానికి చంద్రుడి వద్దకు వెళ్లి రావడం కన్నా, ఇలా తయారు చేసిన మెట్లే సరైన కొలమానం అనిపిస్తోంది" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను, దాని వెనుక ఉన్న ప్రేమను లోకేశ్ అభినందించడం విశేషం.
Advertisement
Nara Lokesh
Satti Siva Narayana Reddy
East Godavari
Homemade Escalator
Andhra Pradesh
Innovation for Wife

More Telugu News