సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Hearing on CI Nagaraju custody petition postponed
  • సాయికృష్ణ లాకప్ డెత్ కేసు
  • నాగరాజును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐ న్యాయవాదికి కోర్టు ఆదేశం
విజయవాడ రౌడీషీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విజయవాడలోని ఏజేఎమ్ కోర్టులో ఈరోజు ఈ కేసుకు సంబంధించి రెండు పిటిషన్లపై విచారణ జరిగింది. 

నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు సేకరించాలని వారు కోరారు. వాదనలు విన్న కోర్టు సీఐ తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆయన తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది. 

గాదె సాయికృష్ణ మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బాబురావును కూడా సిట్ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు.
Advertisement
CI Nagaraju
Gade Sai Krishna
Vijayawada Lockup Death Case
SIT Investigation
Vijayawada AJM Court
Constable Baburao

More Telugu News