ఆఫ్ఘన్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్
- ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు
- 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా
- శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్
- రిషభ్ పంత్, సాయి సుదర్శన్ అర్ధశతకాలు
- ఆప్ఘన్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చేలాయించారు. గిల్, రాహుల్ సెంచరీలతో బలమైన పునాది వేయగా, మిడిలార్డర్‌లోనూ పరుగుల వరద కొనసాగింది. రిషభ్ పంత్ (81), సాయి సుదర్శన్ (81) అర్ధశతకాలతో రాణించి జట్టు స్కోరును మరింత పెంచారు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మహ్మద్ సిరాజ్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేయడం విశేషం. అందులో 4 ఫోర్లు, 1 సిక్సు ఉండడం సిరాజ్ దూకుడుకు నిదర్శనం. కొత్త కుర్రాడు మానవ్ సుతార్ 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 28 పరుగులు చేశాడు.
భారత బ్యాటర్లు విజృంభించినప్పటికీ, ఆప్ఘనిస్థాన్ బౌలర్ మహ్మద్ సలీం సఫీ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ భారత జట్టు భారీ స్కోరు సాధించడాన్ని అడ్డుకోలేకపోయాడు.