భోపాల్ లో 'పెద్ది' ఈవెంట్ కోసం రూ.150 కోట్లతో కళ్లు చెదిరే ఏర్పాట్లు!
- ఈ నెల 23న బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో ఈ మెగా ఈవెంట్
- మెగా వేడుకలో రెహ్మాన్ లైవ్ ఫర్మార్మెన్స్
- ఈవెంట్ కోసం రూ.150 కోట్ల ఎక్విప్‌మెంట్ తరలింపు
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చే నెలలో విడుదలవుతున్న 'పెద్ది' చిత్రానికి సంబంధించి, ఈ నెల 23వ తేదీన భోపాల్ వేదికగా జరగబోయే మ్యూజికల్ ఈవెంట్ వైపు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం మేకర్లు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. 'పెద్ది' చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో మే 23న జరగనున్న మెగా వేడుకలో రెహ్మాన్ లైవ్ పెర్మార్మెన్స్ ఇవ్వబోతున్నారు.
ఈ లైన్ కాన్సర్ట్ కోసం మన దేశంలో ముందెన్నడు ఉపయోగించని అత్యంత ఖరీదైన సాంకేతికతను, మ్యూజిక్ ఎక్విప్‌మెంట్స్‌ను వాడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని ముంబై నుంచి భోపాల్ తరలిస్తున్నారు. అయితే దీనికి అద్దె రూపంలో రూ.1 కోటి వరకు చెల్లిస్తున్నారని తెలుస్తోంది.
మే 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో ఈ మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ సందర్బంగా చిత్రానికి సంబంధించి స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. 'యూవీ మీడియా సంస్థ' ఈ ఈవెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఈ మెగా ఈవెంట్‌ను చూడాలనుకునే వారికి రేపటి నుంచి ఈవెంట్ జరిగే వేదిక వద్ద ఉచిత పాస్‌లను పంపిణీ చేస్తారు.