అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మను, అమరావతిని ఇష్టపడని వారిని పట్టించుకోం.. జగన్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి: ఏపీ మంత్రి సంధ్యారాణి

minister sandhyarani criticizes ys jagan
  • రాజకీయం చేసే ముందు జగన్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలన్న‌ మంత్రి సంధ్యారాణి 
  • ఉత్తరాంధ్రను వైసీపీ సర్వనాశనం చేసిందని, తాము అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ
  • కూటమి కృషితోనే గూగుల్, అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలు వస్తున్నాయని వెల్లడి
మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి తన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాతే రాజకీయం గురించి మాట్లాడాలని, సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ముందుగా సమాధానం చెప్పాలని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ను ఇష్టపడనీ వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన పనిలేదని, అలాంటి వారికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు అసూయతో, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని సంధ్యారాణి ఆరోపించారు. "ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ప్రజల ఆస్తులు లాక్కున్నారు. విశాఖ వాసుల మంచితనాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా దోచుకున్నారు. రుషికొండను బోడికొండగా మార్చడమే కాకుండా, స్టీల్ ప్లాంట్‌ను మూసివేయించారు. వ్యాపారాలను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలి" అని ఆమె మండిపడ్డారు.

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది, చేసేది కూడా తమ ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్‌ను తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌ల కృషితోనే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ విశాఖకు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అర్సెల్లార్ మిట్టల్ వంటి సంస్థలతో పాటు పార్వతీపురంలో గిరిజన విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నాయని వివరించారు.

కూటమి ప్రభుత్వం ఉందన్న ధైర్యంతోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం తన వందేళ్ల పండుగను సగర్వంగా జరుపుకుంటోందని సంధ్యారాణి అన్నారు. వైసీపీ హయాంలో విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ తమ పార్టీ మీటింగులు పెడతారోనని వైస్ ఛాన్సలర్లు సైతం భయంతో గడిపారని ఆమె ఎద్దేవా చేశారు.

Advertisement
sandhyarani
criticizes
ys jagan
Andhra Pradesh

More Telugu News