Advertisement

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy visited Medigadda barriage
  • కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌ను పరిశీలించిన రేవంత్
  • యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • కాసేపల్లో కాటారంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందంతో కలిసి స్వయంగా పరిశీలించారు. కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌తో పాటు పగుళ్లు ఇచ్చిన ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం, తాజా పరిస్థితులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


వర్షాకాలం రాకముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టిందని పరోక్షంగా సంకేతాలిస్తూనే, నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ పర్యటనలో ఆయన వెంట ఉన్నారు. 


మేడిగడ్డ పర్యటన అనంతరం కాటారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు. ఈ వేదిక నుంచే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. 

Advertisement
Revanth Reddy
congress
Medigadda

More Telugu News