Advertisement

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

CM Revanth Reddy Visits Kaleshwaram Temple
  • భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
  • రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం
కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.

అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలిస్తారు. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తూరిపల్లికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతారు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు.
Advertisement
CM Revanth Reddy Visits Kaleshwaram Temple
CM Revanth Reddy at Kaleswaram

More Telugu News