ఏపీ సీఎంపై పోస్టుల కేసు.. మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్
- సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుల కేసులో పూడి శ్రీహరి అరెస్ట్
- జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరి
- ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
- చిత్తూరులో నమోదైన కేసు ఆధారంగా పోలీసుల చర్యలు
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి సీపీఆర్ఓగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో యానిమేషన్ పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై చిత్తూరు జిల్లాలో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా యానిమేషన్ చేసి పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.