జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం
- ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్
- ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి
- బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పద్ధతికి తాము వ్యతిరేకమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే హరీశ్ రావు చూపించాలని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.