తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి... ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరో తేలిపోయింది. తిరుచిరాపల్లి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్‌లో వివరాలు పొందుపరిచారు.
అఫిడవిట్ ప్రకారం లీమా రోజ్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన మార్టిన్ పేరిట అత్యధికంగా ఆస్తులు ఉన్నాయి. ఆయనకు రూ.3,262 కోట్ల చరాస్తులు, రూ.887 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి కుమారుడు జోస్ టైసన్ మార్టిన్ పేరిట కూడా రూ.225 కోట్ల చరాస్తులు, రూ.439 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో లీమా రోజ్ రూ.9.82 కోట్లు, ఆమె భర్త రూ.11.39 కోట్లు ఆదాయం చూపించారు. ఆమె చేతిలో రూ.5 లక్షల నగదు ఉండగా, ఆమె భర్త వద్ద రూ.56 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. బంగారం, వెండి, వజ్రాల వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. లీమా రోజ్ వద్ద 19,233 గ్రాముల బంగారం, 1,31,813 గ్రాముల వెండి, 1,217 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
లీమా రోజ్ తన విద్యార్హతను ఆరో తరగతిగా పేర్కొన్నారు. తనపై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సమర్పించే ఈ అఫిడవిట్‌లోని వివరాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.